పఠాన్ సినిమాపై మాట మార్చిన మధ్యప్రదేశ్ హోంమంత్రి

by Harish |   ( Updated:2023-01-26 14:27:09.0  )
పఠాన్ సినిమాపై మాట మార్చిన మధ్యప్రదేశ్ హోంమంత్రి
X

భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట మార్చారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ పఠాన్ మూవీని రాష్ట్రంలో అడ్డుకుంటామని మిశ్రా హెచ్చరించారు. అయితే సెన్సార్ బోర్డు వివాదాస్పద పదాలపై జాగ్రత్త వహించిన నేపథ్యంలో నిరసన తెలిపి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. బుధవారం సినిమా విడుదల కాగా సినిమాను నిలిపివేయాలని నిరసనలకు దిగడంపై ఆయన స్పందించారు. 'సినిమాలో తప్పులను సరిదిద్దినట్లుగా నేను భావిస్తున్నాను. వివాదాస్పద వ్యాఖ్యలను సెన్సార్ బోర్డు తొలగించింది. ఇలాంటి సమయంలో నిరసనలు తెలిపి ఎలాంటి ప్రయోజనం లేదు' అని అన్నారు.

కాగా, ప్రధాని మోడీ ఈ మధ్య సినిమాలపై అనవసరపు వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ నేతలనుద్దేశించి అన్నారు. ఈ నేపథ్యంలో నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకుముందు బేషరమ్ సాంగ్ వివాదంలో సినిమాను రాష్ట్రంలో ప్రదర్శితం కాకుండా నిషేధిస్తామని మంత్రి హెచ్చరించిన సంగతి తెలిసిందే.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed