Congress : వినేశ్ ఫొగట్‌‌పై అనర్హత వేటులో కుట్రకోణం : కాంగ్రెస్

by Hajipasha |
Congress : వినేశ్ ఫొగట్‌‌పై అనర్హత వేటులో కుట్రకోణం : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఒలింపిక్స్ ఫైనల్‌కు వెళ్లకుండా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంపై కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక కుట్రకోణం ఉందేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసన తెలిపిన రెజ్లర్లలో వినేశ్ ఫొగట్‌ కూడా ఉన్నారని రణదీప్ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నూతన పార్లమెంటు భవనం వద్దకు చేరుకున్న వినేశ్ ఫొగట్‌ను ఈడ్చుకెళ్లిన చరిత్ర ఢిల్లీ పోలీసులకు ఉందన్నారు.

వినేశ్ మేనమామను కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి

వినేశ్ ఫొగట్ మేనమామ మహావీర్ ఫొగట్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం కలిశారు. ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్‌‌లో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌ మ్యాచ్‌లో పాల్గొనకుండా వినేశ్‌పై వేటుపడటాన్ని ఆయన ఖండించారు. ‘‘ఒలింపిక్స్‌లో విధులు నిర్వర్తించే కోచ్‌లు, ఫిజియో థెరపిస్ట్‌లు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వారంతా అక్కడికి సెలవులకు ఏమైనా వెళ్ళారా?’’ అని సీఎం మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story