Mk stalin comment: అలా చేస్తే ఒంటరి అవుతారు..మోడీకి స్టాలిన్ వార్నింగ్

by vinod kumar |
Mk stalin comment: అలా చేస్తే ఒంటరి అవుతారు..మోడీకి స్టాలిన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరిగా మిగిలిపోతారని ప్రధాని మోడీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కేంద్రం విస్మరించిందని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్నికలు ముగిశాయి. కాబట్టి ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలి. 2024 బడ్జెట్ మీ పాలనను కాపాడుతుంది. కానీ దేశాన్ని రక్షించదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండి. లేకపోతే మీరు ఒంటరి అవుతారు’ అని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని ఓడించిన వారి పట్ల ఇంకా ప్రతీకారం తీర్చుకోవద్దు. మీ రాజకీయ ఇష్టా ఇష్టాల ప్రకారం పాలించొద్దు. అది మీకే ప్రమాదం’ అని సూచించారు. మరోవైపు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తప్పనిసరిగా ఎంకే స్టాలిన్‌ను స్పూర్తిగా తీసుకోవాలని, తనకు ఓటు వేయని ప్రజల కోసం పనిచేయాలన్నారు.

Advertisement

Next Story