ప్రధాన పైప్‌లైన్‌ భద్రతకు పోలీసులను నియమించండి: మంత్రి అతిషి

by Harish |
ప్రధాన పైప్‌లైన్‌ భద్రతకు పోలీసులను నియమించండి: మంత్రి అతిషి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న కొద్ది ప్రస్తుతం ఉన్న నీటి వనరులను కాపాడుకోడానికి ఢిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా నీటి దొంగతనాలను అరికట్టడానికి రాబోయే 15 రోజుల పాటు ప్రధాన పైప్‌లైన్‌ల భద్రత కోసం పెట్రోలింగ్, రక్షణ కోసం సిబ్బందిని నియమించాలని అభ్యర్థిస్తూ ఢిల్లీ నీటి మంత్రి అతిషి ఆదివారం పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు.

యమునా నదిలో నీటి కొరత కారణంగా నీటి సరఫరా దాదాపు 70 ఎంజీడీలు పడిపోయింది, ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి, ఈ పరిస్థితిలో ప్రతి నీటి బొట్టు విలువైనది, పైప్‌లైన్‌ల నుంచి కొంతమంది నీటిని దొంగలిస్తున్నారు. అనేక బోల్ట్‌లను కత్తిరించడం వలన లీకేజీలు అవుతున్నట్లు మా పెట్రోలింగ్ బృందం కనుగొంది. ప్రధాన నీటి పంపిణీ నెట్‌వర్క్ కోసం ఢిల్లీ జల్ బోర్డు పెట్రోలింగ్ బృందాలను నియమించింది. అదనంగా, సపోర్ట్ కోసం గ్రౌండ్ పెట్రోలింగ్ బృందం ఉంది. అయినప్పటికీ పోలీసుల పెట్రోలింగ్ కూడా చాలా అవసరం. ప్రధాన పైప్‌లైన్‌లను రక్షించాలని, నీటి పైప్‌లైన్‌లను ట్యాంపరింగ్ చేయకుండా కట్టడి చేయడానికి సహయం అందించాలని మంత్రి అతిషి, పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో అన్నారు. ఇటీవల ఒక పైపు దెబ్బతినగా మెయింటెనెన్స్ టీమ్ ఆరు గంటల పాటు పనిచేసి లీకేజీని సరి చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed