OpenAI CEO: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సామ్ ఆల్ట్‌మన్ భేటీ..

by Shamantha N |
OpenAI CEO: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సామ్ ఆల్ట్‌మన్ భేటీ..
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(AI) రేసు నడుస్తోందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఓపెన్ ఏఐ కో ఫౌండర్, సీఈవో సామ్ ఆల్టమన్ తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏఐ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏఐ స్టాక్ రూపకల్పన కోసం సమగ్ర వ్యూహాన్ని రూపొందించిందని.. ఈ మిషన్ తో దేశంతో సహకరించేందుకు ఓపెన్ ఏఐ సిద్ధంగా ఉందన్నారు. “ ఏఐ స్టాక్‌ను సృష్టించే వ్యూహంపై సామ్ ఆల్టమన్ తో సూపర్ కూల్ చర్చ జరిగింది. ఏఐ స్టాక్, జీపీయూ, మాడల్, యాప్‌ల తయారీలో భారత్‌కు సహకరించడానికి ఓపెన్ ఏఐ సిద్ధంగా ఉంది. ఏఐ పై ప్రధాని విజన్ ని సామ్ ఆల్టమన్ ప్రశంసించారు. సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలనే మోడీ లక్ష్యాన్ని అభినందించారు” అని అశ్వినీ వైష్ణన్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.

సామ్ ఆల్టమన్ ఏమన్నారంటే?

అంతకుముందు సామ్ మాట్లాడుతూ.. భారత్ లో ఏఐకి చాలా మార్కెట్ ఉందన్నారు. చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకొచ్చారు. ‘‘భారత్‌లోని ప్రజలు ఎక్కువగా స్టాక్‌, చిప్స్‌, మోడల్స్‌ ఇలా అద్భుతమైన అప్లికేషన్లపై దృష్టిసారిస్తున్నారు. దేశం ప్రతి విషయంలో ముందుకుసాగుతోంది. ఇక్కడి ప్రజలు చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. భవిష్యత్తులో భారత్‌.. ఏఐ విప్లవాత్మక ప్రపంచంలో నాయకుడిగా ఎదగాలి’’ అని ఆల్ట్‌మన్‌ ఆకాంక్షించారు. మరోవైపు, విద్య కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఏఐలకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా దేశంలోని విద్యా వ్యవస్థలో ఏఐ పరిశోధన, దాని వినియోగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.



Next Story