రెండేళ్ల తర్వాత మను భాకర్‌కు పతకం

by srinivas |
రెండేళ్ల తర్వాత మను భాకర్‌కు పతకం
X

భోపాల్ : ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్ఎఫ్) పిస్టోల్/రైఫిల్ వరల్డ్ కప్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. దాంతో సీనియర్ లెవల్‌లో వ్యక్తిగత విభాగంలో రెండేళ్ల తర్వాత ఆమె పతకం గెలుచుకున్నారు. 2021లో న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్‌లో ఆమె చివరి సీనియర్ మెడల్ సాధించారు. శనివారం జరిగిన ర్యాంకింగ్ మ్యాచ్‌లో 14 పాయింట్లతో మను భాకర్ మూడో స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించారు. మెడల్ రౌండ్‌లో 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు. జర్మనీకి చెందిన డోరిన్ వెన్నెక్యాంప్(30 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా.. చైనాకు చెందిన జియూ డు(29 పాయింట్లు) రజతం సాధించారు. తెలంగాణ బాక్సర్ ఇషా సింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.

Advertisement

Next Story

Most Viewed