Delhi Liquor Case: తిహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల

by Gantepaka Srikanth |
Delhi Liquor Case: తిహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియా శుక్రవారం విడుదల అయ్యారు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సైతం బెయిల్ మంజూరు కావడంతో ఆప్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.


Next Story

Most Viewed