President Rule : రాష్ట్రపతి పాలనలో మణిపూర్ రికార్డ్... ఏకంగా 11 సార్లు

by M.Rajitha |   ( Updated:2025-02-13 16:42:59.0  )
President Rule : రాష్ట్రపతి పాలనలో మణిపూర్ రికార్డ్... ఏకంగా 11 సార్లు
X

దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్(Manipur) లో కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి పాలన(President Rule) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మణిపూర్ రాష్ట్రపతి పాలన విధించబడటంలో రికార్డ్ సృష్టించింది. ఏకంగా 11 సార్లు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ&కాశ్మీర్ 9 సార్లు, పంజాబ్ 8 సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్నాయి. కాగా దేశంలో ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా జమ్ము కాశ్మీర్ 4668 రోజులు ఉండగా.. తర్వాత పంజాబ్ 3878 రోజులు. ఇక మన దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన విధించబడ్డ రాష్ట్రం 1951లో పంజాబ్. అదే విధంగా ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలుగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ ఉన్నాయి.

ఇక ఇటీవలే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్(Biren Singh) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలో ఉండటంతో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎంగా కొనసాగాలని బీరెన్‌సింగ్‌ను గవర్నర్‌ కోరారు. అయితే.. బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదు. నాలుగు రోజులు పూర్తి కావడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.

ఇదిలా ఉండగా.. జాతుల మధ్య వైరంతో గతకొన్ని నెలలుగా మణిపూర్ తగలబడిపోతున్నది. ఈ నేపథ్యంలోనే మణిపూర్‌లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి భారీగా సైనికులను పంపుతోంది. రాష్ట్రానికి 10 వేల మందికిపైగా అదనంగా పంపుతోందని, దీంతో కంపెనీ బలగాల సంఖ్య 288కి చేరుతుందని మణిపూర్ సీఎంవో అధికారుల ద్వారా తెలిసింది. 90 కంపెనీలకు చెందిన 10,800 మంది కేంద్ర బలగాలు మణిపూర్ చేరుకుంటున్నాయని వారు చెప్పారు. మణిపూర్ హింసలో గతేడాది మే నుంచి ఇప్పటి వరకూ 258 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed