ఓ భారతీయ యువకుడా... నీ మంచితనానికి ముగ్ధురాలినవుతున్నా : విదేశీ మహిళ

by S Gopi |   ( Updated:2023-02-26 05:23:15.0  )
ఓ భారతీయ యువకుడా... నీ మంచితనానికి ముగ్ధురాలినవుతున్నా : విదేశీ మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: ఓ విదేశీ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారతీయుల గొప్పతనం గురించి, భారత్ పర్యటన చేస్తే ఎంతవరకు సేఫ్ అనే అంశాలతోపాటు పలు విషయాలు పేర్కొన్నది. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం వెళితే... భారత్ లో పర్యటించిన యునైటేడ్ స్టేట్స్ కు చెందిన ఓ మహిళ రైలులో ప్రయాణిస్తూ తన వాలెట్ ను మరిచిపోయి స్టేషన్ లో దిగి వెళ్లిపోయింది.

అది గమనించిన గుజరాత్ కు చెందిన ఓ యువకుడు ఆ వాలెట్ లో ఉన్న వివరాల ఆధారంగా ఆ యువకుడు ఆమెకు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పెట్టాడు. అది కూడా అతనికి అంతగా ఇంగ్లీష్ రాకపోయినా కూడా తనకు వచ్చిన విధంగా ఇంగ్లీష్ లో మెసేజ్ పెట్టాడు. అది చూసిన ఆ మహిళ అతని వద్దకు వెళ్లి తన వాలెట్ ను తీసుకుంది. ఆ సమయంలో ఆ మహిళ ఆ యువకుడికి డబ్బులు ఇవ్వబోయింది. ఆ డబ్బులను తీసుకునేందుకు ఆ యువకుడు నిరాకరించాడు. అంతేకాదు.. వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి అంటూ ఆమెకు సూచించాడు. దీంతో ఆమె ఆమె అతడిని పొగుడుతూ ప్రసంశల వర్షం కురిపించింది. అంతేకాదు.. భారత్ లో పర్యటిస్తే ఎంతో సేఫ్ గా ఉంటుందో కూడా వివరించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆ యువకుడిపై.

https://www.instagram.com/reel/CoJ8uG0PUZw/?utm_source=ig_embed&utm_campaign=loading

Advertisement

Next Story

Most Viewed