- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర ఫలితాలు ఊహించలేదు.. వారందరికీ ధన్యవాదాలు: రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్వీట్‌లో "ఇండియా కూటమికి భారీ విజయం అంధించిన అందించినందుకు జార్ఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం కోసం కృషిచేసిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్, JMM కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. రాష్ట్రంలో మహాకూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగం తో పాటు నీరు, అటవీ, భూముల పరిరక్షణకు దక్కిన విజయం అని రాసుకొచ్చారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఊహించనివి, మేము వాటిని వివరంగా విశ్లేషిస్తాము. ఇండి కూటమి విజయం కోసం.. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు." అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో విజయం సాధించగా, ఇండియా కూటమి 45 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జార్ఖాండ్ లో మాత్రం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 56 స్థానాల్లో విజయం సాధించి జె ఎమ్ఎమ్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.