- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మహాకుంభ్‌లో నాణ్యమైన సరుకులు.. ఇలా ఆర్డర్ చేయండి

- ఇప్పటికి 1000 మెట్రిక్ టన్నుల పంపిణీ
- నాఫెడ్ ఆధ్వర్యంలో పంపిణీ
- వాట్సప్ ద్వారా కూడా అర్డర్లు
దిశ, నేషనల్ బ్యూరో: మహాకుంభమేళా 2025కు తరలి వస్తున్న భక్తుల కోసం నాణ్యమైన సరుకులు చౌక ధరలకే అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటీవ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన గోధుమ పిండి, బియ్యం, పప్పులు, నూనెలు ఇతర సరుకులను సబ్సిడీ ధరలకే అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం వాట్సప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కూడా సరుకులను ఆర్డర్ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇప్పటి వరకు భక్తులకు 1000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారు. ఇందు కోసం 20 మొబైల్ వ్యాన్లను వినియోగిస్తున్నారు. మహా కుంభమేళాలో ఏ ఒక్కరు కూడా ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కోవద్దనే ఈ పథకాన్ని నిరంతరం అమలు చేస్తున్నట్లు నాఫెడ్ చీఫ్ రోహిత్ జైన్ చెప్పారు. కేంద్ర సహకార మంత్రత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్ారు. కేవలం భక్తులకే కాకుండా సాధువులు, మత గురువులు, కల్పవాసులకు కూడా పథకాన్ని వర్తింప చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 750 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 350 మెట్రిక్ టన్నుల పప్పులు, 10 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామన్నారు. భారత్ బ్రాండ్ ఆహార ధాన్యాలను భక్తులకు అందిస్తున్నామని చెప్పారు. ఆహార ధాన్యాలు కావల్సిన వారు 7275781810 నంబర్‌కు వాట్సప్ లేదా కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చని తెలిపారు.