- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lowest win : మహారాష్ట్రలో అత్యల్ప మెజారిటీ వారిదే?
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానాల్లో ప్రతి రౌండ్‌కూ ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఇందులో మాలెగావ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ (Mohammad ismail) తన సమీప అభ్యర్థిపై 162 ఓట్ల తేడాతో బయటపడ్డారు. ఇస్మాయిల్ కు 1,09,653 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి ఆసిఫ్ షేక్ రషీద్‌కు (Shake Rasheeh) 1,09,491ఓట్లు పోలయ్యాయి. సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలే (Nana patole) కేవలం 208 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అవినాష్ అనంరావ్ బ్రహ్మాంకర్‌పై విజయం సాధించారు. అలాగే బేలాపూర్ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి మందా విజయ్ మ్హత్రే ఎన్సీపీ అభ్యర్థి సందీప్ గణేష్ నాయక్‌పై 377 ఓట్ల తేడాతో గెలుపొందారు. బుల్దానా అసెంబ్లీ స్థానంలో శివసేన అభ్యర్థి గైక్వాడ్ సంజయ్ రాంభౌ శివసేన(యూబీటీ) అభ్యర్థి జయశ్రీపై 841 ఓట్ల తేడాతో గెలిచారు. అంతేగాక నవాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి శిరీష్‌కుమార్ సురూప్‌సింగ్ నాయక్ 1,121 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి శరద్ కృష్ణారావు గవిట్‌పై విజయం సాధించారు.