MUDA Case: సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్ఐఆర్.. ముడా స్కాం కేసులో కీలక పరిణామం

by Hajipasha |
MUDA Case: సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్ఐఆర్.. ముడా స్కాం కేసులో కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో : మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు మైసూరు లోకాయుక్త చర్యలు మొదలుపెట్టింది. ఈక్రమంలోనే మైసూరు లోకాయుక్తకు చెందిన పోలీసు విభాగం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 11/2024 కేస్ నంబరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఏ1 నిందితుడిగా సీఎం సిద్ధరామయ్యను, ఏ2 నిందితులుగా సిద్ధరామయ్య సతీమణి పార్వతి, మరో ఇద్దరిని పేర్కొన్నారు.

ముడాకు చెందిన దాదాపు 14 స్థలాలను సతీమణి పార్వతికి సిద్ధరామయ్య అక్రమంగా కట్టబెట్టారంటూ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు పలు ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కోర్టులను ఆశ్రయించినా ఊరట దక్కలేదు. ఆయనపై లోకాయుక్త విచారణకు బుధవారం రోజు ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed