- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండోదశ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. దీంతో గురువారం నుంచే రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 4. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నామినేషన్ పత్రాల పరిశీలన ఏప్రిల్ 5న జరగనుంది. నామినేషన్ పత్రాల పరిశీలన జమ్మూ కశ్మీర్‌లో ఏప్రిల్ 6న జరుగుతుందని నోటిఫికేషన్‌లో ఎన్నికల సంఘం పేర్కొంది. రెండో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ‘ఔటర్ మణిపూర్’ లోక్‌సభ స్థానంలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మొదటి దశలో(ఏప్రిల్ 19న), మిగతా అసెంబ్లీ స్థానాల్లో రెండో దశలో(ఏప్రిల్ 26న) పోలింగ్ జరగనుంది.