కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రిపై ఈసీకి ఫిర్యాదు

by S Gopi |
కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రిపై ఈసీకి ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల నామినేషన్ సందర్భంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే ఆరోపణలపై సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ఆదివారం బీజేపీ తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్‌లో వివరాలు దాచారని, గతేడాది ఆదాయాన్ని చాలా తక్కువగా చూపించినట్టు ఎల్‌డీఎఫ్ నేతలు ఫిర్యాదులో పేర్కొంది. ఆయనకు జూపిటర్ కేపిటల్ కంపెనీలో ఉన్న మెజారిటీ వాటాల నుంచి వచ్చే ఆదాయం గురించి అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపణలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ చంద్రశేఖర్ ఆదాయపు పన్ను పరిమితి కింద వచ్చిన ఆదాయం రూ. 680 మాత్రమే, తన ఆస్తుల విలువ రూ. 28 కోట్లు అని పేర్కొన్నారు. జూపిటర్ కేపిటల్‌తో సహా తన ప్రధాన కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించలేదని, కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఎల్‌డీఎఫ్ ఫిర్యాదులో పేర్కొంది. ఇక, ఇదే అంశంపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సైతం రాజీవ్ చంద్రశేఖర్‌పై ఈసీకి ఫిర్యాదు చేసింది. కాగా, ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ తిరవనంతపురం నుంచి యూడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న శశిథరూర్‌తో పోటీ నిల్బడ్డారు.

Advertisement

Next Story