Lalu Prasad Yadav: ప్రధాని నరేంద్ర మోడీ అసలు హిందువే కాదు.. ఆర్జేడీ నేత లాలు సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-03-04 13:12:11.0  )
Lalu Prasad Yadav: ప్రధాని నరేంద్ర మోడీ అసలు హిందువే కాదు.. ఆర్జేడీ నేత లాలు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తన్న తరుణంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ బాంబు పేల్చారు. ఇవాళ ఆయన పాట్నాలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ అసలు హిందువే కాదని ఆరోపించారు. హిందూ ధర్మం గురించి మోడీ ప్రసంగిస్తారు కానీ, వాటిని పాటించరంటూ మండిపడ్డారు. ఆయన త్లలి హీరాబెన్ మోడీ కాలం చేస్తే.. ప్రధాని కనీసం గుండు కూడా కొట్టించుకోలేదని ఆరోపించారు. మాట్లాడితే కుంటుంబ రాజకీయాలు తాను విరుద్ధమంటూ మోడీ లెక్చర్లు ఇస్తారని, ఆయనకు అసలు కుటుంబమే లేదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed