లఢఖ్ సరిహద్దుల్లో 500 మొబైల్ టవర్లు

by srinivas |
లఢఖ్ సరిహద్దుల్లో 500 మొబైల్ టవర్లు
X
  • ఇంటర్నెట్ సదుపాయం బలోపేతానికి కృషి
  • కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడి

లఢఖ్: దేశ సరిహద్దుల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో లఢఖ్‌లో 500‌కు పైగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మౌళిక సదుపాయాల కల్పనకు కౌంటర్ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. టవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత లఢఖ్ 4జీ, 5జీ సేవలు పొందుతుందని వెల్లడించింది. సరిహద్దు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన సవాళ్లలో పలు ప్రాంతాలు కమ్యూనికేషన్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు చైనా నియంత్రణ రేఖ సమీపంలోనే మొబైల్ టవర్లు ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు ఇంటర్నెట్ సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్లలో భారీ మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని, ప్రతిరోజూ 300 మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed