- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సిద్ధరామయ్య పై జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఫైర్
బెంగళూరు : బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకుగానూ తమ పార్టీకి ఉన్న లౌకిక అర్హతలను ప్రశ్నించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి మండిపడ్డారు. గతంలో మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షం గా వ్యవహరించిన శివసేనతో.. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందో తెలుసుకోవాలని సీఎంకు సూచించారు. ‘‘సెక్యులర్ అనే ట్యాగ్‌లైన్‌తో కుల సమావేశాలను నిర్వహించి కుక్కర్లు, ఐరన్‌బాక్స్‌లను పంపిణీ చేయడం లౌకికవాదమా ? మతాల సదస్సులు, కులతత్వ సమావేశాలను నిర్వహించడం సెక్యులర్ అవుతుందా ? మీరు మైనారిటీలు, బీసీలకు నాయకుడా చెప్పండి ?’’ అంటూ కుమారస్వామి ట్విట్టర్ వేదికగా సిద్ధరామయ్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘సిద్ధరామయ్య ఒక నకిలీ సోషలిస్టు. సోషలిజం అనే పదాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునేందుకు ఆయన బీజేపీకి మతతత్వ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ బీ టీమ్ గా పేరొందిన కొన్ని పార్టీలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు సెక్యులర్ అనే పదం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.