Kolkata: అత్యాచారం చేశారని తప్పుడు కేసు.. తల్లీకూతుళ్లపై హైకోర్టు సంచలన ఆదేశాలు

by Ramesh Goud |
Kolkata: అత్యాచారం చేశారని తప్పుడు కేసు.. తల్లీకూతుళ్లపై హైకోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారని తల్లీకూతుళ్లు తప్పుడు కేసు పెట్టిన ఘటనలో కోల్‌కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తల్లీకూతుళ్లపై విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. తన కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారని ఏడాది క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముగ్గురు వ్యక్తులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆ ముగ్గురు వ్యక్తులు ఏడాది కాలంగా జ్యూడిషియల్ రిమాండ్ లో మగ్గుతున్నారు. అయితే ఇటీవలే ఈ కేసులో బెయిల్ కోరుతూ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ విచారణలో భాగంగా.. రాజకీయ ఒత్తిళ్లతోనే నిందితులపై తప్పుడు కేసు పెట్టినట్లు మహిళ అంగీకరించింది.

తన భర్తకు ప్రమాదంలో వెన్నుపూస విరగడంతో కుటుంబం ఆర్థిక కష్టాల్లోకి వెళ్లిందని, స్థానిక రాజకీయ నాయకులు కూతురిపై అత్యాచారం చేసినట్లు తప్పుడు కేసు పెడితే ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడంతో ఈ పని చేసినట్లు బాధితురాలి తల్లి కోర్టుకు చెప్పింది. ఇది విన్న జస్టిస్ అరిజిత్ బెనర్జీ , జస్టిస్ అపూర్బా సిన్హా రేలతో కూడిన ధర్మాసనం ఆశ్యర్యానికి గురయ్యారు. నిందితులకి తక్షణ బెయిల్ మంజూరు చేయడమే కాక ముగ్గురిపై కేసును మూసివేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించారు. అలాగే అమాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ఒకరి పేదరికి మంచి కారణం కాగలదా? అని ప్రశ్నించిన కోర్టు.. తప్పుడు ఫిర్యాదు చేసి, కల్పిత సాక్ష్యాలు అందించిన మహిళలు చట్ట ప్రకారం బాధ్యులు అవుతారా? లేదా? అనే దానికి పై విచారణ జరిపించాలని ట్రయల్ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేశింది.

Advertisement

Next Story

Most Viewed