కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఖర్గే లేఖ!

by Sathputhe Rajesh |   ( Updated:28 Jan 2023 7:11 AM  )
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఖర్గే లేఖ!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ జోడో యాత్రలో భద్రతా లోపంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఖర్గే లేఖ రాశారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అమిత్ షాను లేఖలో కోరారు. రాబోయే రెండు రోజులు ప్రజలు భారీగా జోడో యాత్రకు వస్తారని ఆ లేఖలో ఖర్గే పేర్కొన్నారు. జనవరి 30న జోడో యాత్ర ముగింపు సభకు భద్రత కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా భద్రతా కారణాలతో జమ్ముకశ్మీర్ లో జరుగుతున్న జోడో యాత్ర నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నిలిపివేశారు. తనకు సరైన రక్షణ కల్పించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. జనాన్ని నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదని ఆయన అన్నారు.

Also Read...

కాంగ్రెస్‌లో Kamal Haasan పార్టీ విలీనం!

Advertisement

Next Story

Most Viewed