- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఢిల్లీలో బీజేపీ హై కమాండ్ కీలక సమావేశం.. ఫోకస్ చేసిన అంశాలివే..!

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో బీజేపీ సంస్థాగత వ్యహహారాలపై కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీలో ఈ రోజు భేటీ అయింది. కాసేపట్లో బీజేపీ సమావేశం ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మీటింగ్‌లో చర్చించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.
పార్టీకి మహాజన్ సంపర్క్ అభియాన్ రిపోర్ట్ ఇప్పటికే చేరింది. అయితే ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినేట్ మంత్రులకు పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు ఈ మీటింగ్‌లో అప్పగించడంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత జరుగుతున్న పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగ్‌లో చర్చిస్తున్నట్లు తెలిసింది. మహాజన సంపర్క్ ప్రొగ్రాం ప్రజల్లోకి ఏ మేరకు చేరిందనే విషయంపై చర్చ నడుస్తోన్నట్లు సమాచారం. తెలంగాణకు సంబంధించి బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కాలం ముగిసినందున ఆయననే కొనసాగించాలా? కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా వంటి అంశాలు భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.