- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీవాల్ అంటే మోడీకి భయం: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీ భయమని అందుకే ఆయనను అరెస్టు చేయించారని చెప్పారు. అరెస్టు తర్వాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా తయారయ్యారని వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఈ నెల 321న ఇండియా కూటమి నిరసన ర్యాలీ చేపడుతోందని, ఈ ర్యాలీలో ఇతర నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొంటానని తెలిపారు. కేజ్రీవాల్ జైలు నుంచే పనిచేయడం ప్రారంభించారని, ప్రజలు కూడా ఆయనకు మద్దతు తెలుపుతారని భావిస్తున్నట్టు చెప్పారు. స్వాత్యంత్ర పోరాటంలోనే జైలుకు వెళ్లిన అనంతరం అనేక మంది నాయకులు మరింత బలంగా తయారయ్యారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అయన జైలు నుంచే పనిచేస్తారని ఆప్ పేర్కొంది.