Kejriwal: ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడి చేస్తోంది.. ఈసీకి కేజ్రీవాల్ లేఖ

by vinod kumar |
Kejriwal: ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడి చేస్తోంది.. ఈసీకి కేజ్రీవాల్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) కార్యకర్తలపై బీజేపీ దాడి చేస్తోందని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సంఘం (EC)కి లేఖ రాశారు. తాను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో స్వతంత్ర పరిశీలకులను నియమించాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఆప్ కార్యకర్తలకు ఈసీ భద్రత కల్పించాలని, వారిపై దాడి చేసిన బీజేపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. భద్రతను నిర్వహించడంలో విఫలమైన పోలీసులను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎక్కడైనా గూండాయిజం జరుగుతున్నట్లు చూస్తే దాన్ని వీడియో తీయాలని, అయితే ఈ సమయంలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గూండాయిజానికి వ్యతిరేకంగా ఢిల్లీ మొత్తం ఏకం కావాలలని పిలుపునిచ్చారు.

కాగా, న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మతో సంబంధం ఉన్న గూండాలు ఆప్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని, మహిళా కార్యకర్తను వేధించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. చెమ్స్‌ఫోర్డ్ క్లబ్ స్లమ్ ఏరియాలో ఆప్ కార్యకర్తలపై దాడి జరిగిందని తెలిపారు. అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాశారు.



Next Story

Most Viewed