Kavery river: తమిళనాడుకు కావేరి నుంచి 30 టీఎంసీల నీరు విడుదల: డీకే శివకుమార్

by vinod kumar |
Kavery river: తమిళనాడుకు కావేరి నుంచి 30  టీఎంసీల నీరు విడుదల: డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: జూలై నెలలో తమిళనాడుకు 30 టీఎంసీల కావేరీ నీటిని విడుదల చేసినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా తమిళనాడుకు ప్రతిరోజూ 51 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ నెలలోనే ఇప్పటి వరకు 30 టీఎంసీలు విడుదల చేశామని.. మరో 10 టీఎంసీలు విడుదల చేస్తే సాధారణ వర్షాకాలంలో రిలీజ్ చేసే దానిని సరిపోతుందని చెప్పారు. కావేరి పరీవాహక ప్రాంతంలోని మొత్తం 1,657 ట్యాంకులను నింపాలని అధికారులను ఆదేశించారు. జూలై 11 నుంచి జులై 30 వరకు 20 టీఎంసీల నీరు విడుదల చేయాలని కావేరి నీటి యాజమాన్య కమిటీ (సీడబ్ల్యూఎంసీ) కోరగా రైతులకు నీరు అందకపోవడంతో నీటిని విడుదల చేయలేదని, దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించినట్టు గుర్తు చేశారు. వారణాసిలో గంగా హారతి తరహాలో కావేరీ హారతిని ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు.

Advertisement

Next Story