- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకు సిగరెట్ అమ్మితే జైలుకే.. కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆమోదం లభించింది. గవర్నర్ సైతం ఆమోదిస్తే ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. ఇది అమల్లోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా హుక్కా బార్‌లపై నిషేధం విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఒకటి నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. దీంతోపాటు 21ఏళ్లలోపు వారికి సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపైనా నిషేధం విధిస్తారు. రాష్ట్రంలో పొగాకు రహిత పర్యవరణాన్ని సృష్టించే లక్ష్యంతో బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం, గుట్కా నమలడం వంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని బ్యాన్ చేస్తారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల రేడియస్‌లో ఆయా ఉత్పత్తులు అమ్మడానికి వీల్లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే షాపు ఓనర్లకు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇటీవలే ఇదే తరహా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, ఆమోదం పొందిన విషయం తెలిసిందే. హుక్కాపై నిషేధం హర్యానాలో ఇప్పటికే అమలవుతోంది.