టెక్ హబ్‌గా ఉన్న బెంగళూరును ట్యాంకర్ హబ్‌గా మార్చిన కాంగ్రెస్: ప్రధాని మోడీ సెటైర్లు

by S Gopi |
టెక్ హబ్‌గా ఉన్న బెంగళూరును ట్యాంకర్ హబ్‌గా మార్చిన కాంగ్రెస్: ప్రధాని మోడీ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా దోపిడీ ముఠాను నడుపుతోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాగల్‌కోట్ ర్యాలీలో ప్రసంగించిన మోడీ.. బెంగళూరులో నీటి సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, టెక్ హబ్‌గా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన కర్ణాటకను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకర్ హబ్‌గా మార్చిందన్నారు. 2జీ స్కామ్ తరహాలో కుంభకోణాలతో జేబులు నింపుకోవాలని కాంగ్రెస్ పాలకులు కలలు కంటున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. కనీసం వారి ఎమ్మెల్యేలకు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల సమకూరని పరిస్థితి ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో కర్ణాటక కాంగ్రెస్ సర్కారు దిగజారిందని మోడీ విమర్శించారు. ట్యాంకర్ మాఫియా నగరంలో నీటిని కొనాలన్నా విపరీతంగా ధరలను పెంచేశారని, ఈ గడ్డు పరిస్థితిని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను ఏటీఎంగా మార్చేసింది. కాంగ్రెస్ దోచుకోవడమే కానీ రాష్ట్ర ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.

Advertisement

Next Story