- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హేమంత్ సోరెన్ కేసులో వాట్స్ నెక్ట్స్.. కపిల్ సిబల్ అంచనాలివీ
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో తదుపరిగా ఏం జరగొచ్చనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై హేమంత్‌కు వ్యతిరేకంగా ఈడీ సాక్ష్యాలను సృష్టిస్తుందని సిబల్ ఆరోపించారు. గత శనివారం జార్ఖండ్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ భానుప్రతాప్ ప్రసాద్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5న భాను ప్రతాప్‌ను ఈడీ రిమాండ్‌కు తీసుకెళ్లి, హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చేలా ఒత్తిడి చేసే అవకాశముందని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ‘‘భాను ప్రతాప్ ప్రసాద్ ఇప్పటికే వేరే భూ కుంభకోణంలోనూ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు హేమంత్ సోరెన్ కేసుకు సంబంధించి అతన్ని ఈడీ అరెస్టు చేసింది’’ అని ఆయన తెలిపారు. ‘‘నా క్లయింట్ హేమంత్ సోరెన్‌కు భాను ప్రతాప్ ప్రసాద్ ఎవరో తెలియదు.అయినా వీళ్లిద్దరికీ బలవంతంగా ముడిపెట్టే ప్రయత్నంలో ఈడీ ఉంది’’ అని వివరించారు. ‘‘కస్టడీలో ఉండగానే హేమంత్ సోరెన్‌పై మరో 10 అక్రమ కేసులు బనాయించే అవకాశం కూడా ఉంది. హేమంత్ సోరెన్ త్వరగా జైలు నుంచి బయటకు రాకుండా చేసి.. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో లబ్ధి పొందడమే బీజేపీ లక్ష్యం’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు.