కైలాస ప్రతినిధి ప్రసంగంపై ఐక్యరాజ్యసమితి క్లారిటీ..

by Vinod kumar |
కైలాస ప్రతినిధి ప్రసంగంపై ఐక్యరాజ్యసమితి క్లారిటీ..
X

జెనీవా: ఐక్యరాజ్యసమితి కైలాస దేశం నుంచి ప్రతినిధి ప్రసంగించడంపై పలు అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. ఐరాస కైలాసను దేశంగా గుర్తించిందా అనే ప్రశ్నల నడుమ బుధవారం స్పష్టత నిచ్చింది. స్వీయ ప్రకటితాలను పరిగణనలోకి తీసుకోమని తెలిపింది. కైలాస ప్రతినిధి ఎన్జీవో సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపింది. ‘బహిరంగ సమావేశాల్లో సాధారణ చర్చలు అనేది వ్యక్తిగతంగా పాల్గొనడానికి లేదా వ్రాతపూర్వక సమర్పణలను ఉండే వేదిక. ఈ చర్చ ఉద్దేశ్యం ఏమిటంటే, సంబంధిత కమిటీల స్వతంత్ర నిపుణులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, వివిధ వాటాదారుల అభిప్రాయాలను వినడానికి అనుమతించడం.

ఇది నిర్దిష్ట సమస్యల పట్ల తమ బాధ్యతలను నెరవేర్చడంలో దేశాలకు సహాయపడుతుంది’ అని ఐరాస అధికారికంగా తెలిపింది. కాగా, గత నెలలో కైలాస దేశ ప్రతినిధిగా విజయప్రియా నిత్యానంద ఐరాసలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే కైలాస శాశ్వత అంబాసిడర్ గా పేర్కొన్న విజయప్రియ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోమని ఐరాస తెలిపింది. అంతకుముందు విజయప్రియ ఐరాస సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవుడిగా స్వయంప్రకటన చేసుకున్న నిత్యానంద 2019లో దేశం వీడి కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు.

Advertisement

Next Story

Most Viewed