Jodo Yatra: గాంధీతో పోల్చడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-16 02:27:13.0  )
Jodo Yatra: గాంధీతో పోల్చడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేత రాహుల్ ను మహాత్మా గాంధీతో పోల్చారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇలా పోల్చడం సరికాదన్నారు. దేశ స్వేచ్ఛ కోసం గాంధీ ఆయన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. 10-12 ఏళ్లు జైలు జీవితం గడిపారన్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రతి సమావేశంలో వారిని ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాందీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహార్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ చేయగలిగినంత చేశారన్నారు. ప్రసుత్తం మనం ఏం చేస్తున్నామనే దానిపై మాత్రమే దృష్టి పెట్టాలన్నారు. ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచించాలన్నారు.

Also Read....

ఫౌంహౌజ్ కేసు: సిట్ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?



Next Story

Most Viewed