Jharkhand Elections: ఝార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. ఆ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి

by Shiva |
Jharkhand Elections: ఝార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. ఆ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి
X

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్‌ (Jharkhand) తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Assembly Election Polling) ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 43 స్థానాలకు పోలింగ్‌ను నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.28 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) వెల్లడించింది. సరాయ్ కెలా-ఖర్ సావా నియోజకవర్గంలో అత్యధికంగా 66.38 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన చోట్ల 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో 683 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొదటి విడతలో భాగంగా సెరైకెల్ల, రాంచీ, జంషెడ్‌పూర్ వెస్ట్, జగన్నాథ్‌పూర్, జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి చంపై సోరెన్ (Champai Soren) సెరైకెళ్ల (Seraikella) నుంచి పోటీ చేస్తుండగా. జంషెడ్‌పూర్ ఈస్ట్‌లో ఒకప్పుడు జంషెడ్‌పూర్ ఎస్పీగా పని చేసిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అజోయ్ కుమార్ (Ajoy Kumar), జార్ఖండ్ మాజీ సీఎం, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహు (Purnima Das Sahu) మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

Advertisement

Next Story