జేఈఈ టాపర్స్‌లో తెలుగు విద్యార్థులు

by John Kora |
జేఈఈ టాపర్స్‌లో తెలుగు విద్యార్థులు
X

- టాపర్‌గా నిలిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞ, బనబత్ర మజి

- జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల

దిశ, నేషనల్ బ్యూరో: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశాల కోసం ఎన్టీయే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లు ఉంటుంది. ఏ సెషన్‌లో అర్హత సాధించినా వారు అడ్వాన్స్ పరీక్షలు రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-1 పరీక్షలు ఈ ఏడాది జనవరిలో జరిగాయి. దానికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. మొదటి సెషన్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో వచ్చిన 12 ప్రశ్నలను తొలగించినట్లు ఎన్టీయే ప్రకటించింది. ఆ ప్రశ్నలకు సంబంధించి 12 మార్కులను అభ్యర్థులకు వేసినట్లు తెలిపింది. ఇక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో 39 మంది విద్యార్థుల ఫలితాలను ఎన్టీయే ప్రకటించలేదు.

దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఐదుగురు రాజస్థాన్ విద్యార్థులు కాగా.. ఏపీకి చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ 100 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. మొత్తం 14 మంది టాపర్లలో సాయి మనోజ్ఞ మాత్రమే అమ్మాయి కావడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన బనిబత్ర మజి కూడా టాపర్లలో ఒకడిగా నిలిచాడు. ఎస్టీ కేటగిరీలో రాజస్థాన్‌కు చెందిన పార్థ్ నెహ్రా, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో చత్తీస్‌గఢ్‌కు చెందిన హర్షల్ గుప్తా టాపర్లుగా నిలిచారు. ఓబీసీ ఎస్సీఎల్ కేటగిరీలో ఢిల్లీకి చెందిన దక్ష్, ఎస్సీ కేటగిరీలో యూపీకి చెందిన శ్రేయస్ లోహియా టాపర్ల జాబితాలో ఉన్నారు.

టాపర్లు వీరే..

- బనిబత్ర మజీ (తెలంగాణ)

- గుత్తికొండ సాయి మనోజ్ఞ (ఏపీ)

- కుషగ్ర గుప్తా (కర్ణాటక)

- ఆయుష్ సింఘాల్ (రాజస్థాన్)

- హర్ష్ ఝా (ఢిల్లీ)

- దక్ష్ (ఢిల్లీ)

- శ్రేయస్ లోహియా (యూపీ)

- సాక్షం జిందాల్ (రాజస్థాన్)

- సౌరవ్ (యూపీ)

- రైత్ గుప్తా (రాజస్థాన్)

- విషద్ జైన్ (మహారాష్ట్ర)

- అర్నవ్ సింగ్ (రాజస్థాన్)

- శివెన్ వికాస్ తోష్నివాల్ (గుజరాత్)

- ఎస్ఎం ప్రకాశ్ బెహరా (రాజస్థాన్)


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story