Jaishankar: వారందరినీ భారత్‌కు రప్పిస్తాం.. అక్రమ వలసలపై జైశంకర్ వ్యాఖ్యలు

by vinod kumar |
Jaishankar: వారందరినీ భారత్‌కు రప్పిస్తాం.. అక్రమ వలసలపై జైశంకర్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వెళ్లిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు. ఎవరైనా భారతీయ పౌరుడు అక్రమ వలసదారుగా ఉన్నట్టైతే చట్టబద్ధమైన ప్రక్రియల ద్వారా వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న జైశంకర్ తాజాగా వాషింగ్టన్‌ (Washington)లో భారతీయ విలేకరులతో మాట్లాడారు. అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తేల్చి చెప్పారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాన్ని కలిగి ఉండాలని నొక్కిచెప్పారు.

ఏదైనా నేరాలకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అక్రమ వలసలను ముడిపెట్టే చాన్స్ ఉందని తెలిపారు. భారతదేశానికి పంపబడే వ్యక్తులను అమెరికా నుంచి ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోందని అలాంటి వ్యక్తుల సంఖ్యను ఇంకా నిర్ణయించలేమన్నారు. భారత్‌తో వాణిజ్యం పునరుద్ధరణపై పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు ప్రమాణ స్వీకారకార్యక్రమానికి భారత్ తరఫున జైశంకర్ హాజరైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.



Next Story

Most Viewed