Jairam ramesh: ఎన్టీఏను ఆదాయ వనరుగా మార్చారు.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

by vinod kumar |
Jairam ramesh: ఎన్టీఏను ఆదాయ వనరుగా మార్చారు.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. గత ఆరేళ్లలో ఎన్టీఏ రూ. 448 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. లక్షలాది మంది యువత భవిష్యత్‌ను ఆదాయం పెంచే మార్గంగా చూడటం సరికాదని ఫైర్ అయ్యారు. ఎన్టీఏపై ఒక ప్రశ్నకు రాజ్యసభలో విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఇచ్చారు. పరీక్షల నిర్వహణకు రూ.3,064.77 కోట్లు వెచ్చించగా, ఎన్టీఏ రూ. 3,512.98 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. దీనిపై జైరాం రమేశ్ తాజాగా స్పందించారు.

‘నీట్ కుంభకోణం ఎన్టీఏ కేంద్రంగానే జరిగింది. ఇది విద్యా మంత్రిత్వ శాఖకు చెందినదే. దీని ఏకైక ఉద్దేశం ప్రయివేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్ ద్వారా పనిచేయడమే’ అని ఆరోపించారు. మెగా స్కామ్‌లను చూసిన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎన్టీఏకి నాయకత్వం వహిస్తాడని మండిపడ్డారు. కేంద్ర గణాంకాల ప్రకారం..‘గత ఆరేళ్లలో రూ. 448 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. పర్యవేక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో విఫలమైంది’ అని తెలిపారు. దేశంలోని యువకుల భవిష్యత్తు అంతిమంగా ప్రభుత్వానికి కేవలం ఆదాయాన్ని పెంచే వనరుగా మారడం ఆందోళనకరమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed