ఎన్నికల తర్వాత కూడా ఆప్‌తో పొత్తు ఉండొద్దు

by John Kora |
ఎన్నికల తర్వాత కూడా ఆప్‌తో పొత్తు ఉండొద్దు
X

- కేజ్రివాల్ మీద నా అభిప్రాయం మారలేదు

- కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోక పోవడమ మంచిది. గతంలో కూడా ఆప్‌కు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ చేసిన పొరపాటు అని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఢిల్లీలోని కోట్లా రోడ్‌లో ఉన్న నూతన కాంగ్రెస్ ముఖ్య కార్యాలయంలో అజయ్ మాకెన్ విలేకరులతో మాట్లాడుతూ 2013లో ఆప్‌కు మద్దతు ఇవ్వకుండా ఉండాల్సింది. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆప్‌తో పొత్తు పెట్టుకోకుండా ఉండుంటే బాగుండేదని మాకెన్ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ భవిష్యత్‌లో ఏ నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదన్నారు. అర్వింద్ కేజ్రివాల్‌ను తాను గతంలో 'యాంటీ నేషనల్' అని సంభోధించాను. ఇప్పటికీ తాను అదే మాట చెబుతానని ఆయన స్పష్టం చేశారు. అర్వింద్ కేజ్రివాల్ యాంటీ నేషనల్ భావజాలం కారణంగా ఢిల్లీలో బీజేపీ బలపడుతోందని మాకెన్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడటం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందిందని మాకెన్ చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదగాల్సి ఉన్నదన్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవడం ఏ పార్టీ వల్లా సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడంతో ఆప్ విఫలమయ్యిందని మాకెన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed