- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై కొత్త అప్‌డేట్
దిశ, నేషనల్ బ్యూరో : భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం తొలిదశ టెస్టింగ్స్ వచ్చే ఏడాది జరుగుతాయని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. గురువారం హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సందర్భంగా ఈవివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.2035కల్లా స్పేస్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ఎస్.సోమనాథ్ తెలిపారు. భారత అంతరిక్ష కేంద్రానికి ఎలాంటి డిజైన్‌ను ఎంపిక చేయాలనే దానిపై ఇప్పుడు కసరత్తు జరుగుతోందన్నారు. కాగా, భారత అంతరిక్ష కేంద్రంలో క్రూ కమాండ్ మాడ్యూల్, ఆవాస మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్‌లు ఉంటాయి. మొత్తం స్పేస్ సెంటర్ బరువు దాదాపు 25 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.