- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Israel: ఆగి ఉన్న బస్సుల్లో వరుస పేలుళ్లు.. ఉగ్రదాడికి కుట్ర

దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ ఇజ్రాయెల్‌లో గురువారం భారీ పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి. పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న మూడు బస్సుల్లో ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు సంభవించటంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా నుండి హమాస్ నలుగురు బందీల మృతదేహాలను విడుదల చేసిన తరువాత ఈ సంఘటనలు జరగటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, పేలని బాంబులను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసారని చెప్పారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే అనుమానితుడు అన్ని బస్సులలో పేలుడు పదార్థాలు అమర్చాడా లేదా బహుళ అనుమానితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పేలుడు పదార్థాలు వెస్ట్ బ్యాంక్‌లో ఉపయోగించిన వాటితో సరిపోలుతున్నాయని అన్నారు. అలాగే, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
జనవరి 19న గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తుల్కరేమ్ నగరంలోని రెండు శరణార్థి శిబిరాలు వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనిక దాడికి కేంద్రంగా ఉన్నాయి. గతంలో ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి నగరాల్లో కాల్పులు, బాంబు దాడులు చేశారు. ఈక్రమంలోనే అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.