అందరితో కలిసి నడవడమే ఇస్లాం నేర్పుతుంది: మోడీ మంగళసూత్ర వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా

by Dishanational2 |
అందరితో కలిసి నడవడమే ఇస్లాం నేర్పుతుంది: మోడీ మంగళసూత్ర వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా
X

దిశ: నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ఇటీవల చేసిన మంగళసూత్ర వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దు్ల్లా ఖండించారు. ఇస్లాం అందరితో కలిసి నడవడమే నేర్పుతుందని తెలిపారు. ‘ఇతర మతాలను చిన్న చూపు చూడాలని ఏ మతమూ బోధించలేదు. ఇతర మతాలను గౌరవించాలని మాత్రమే ఎల్లప్పుడూ చెబుతాయి. మంగళసూత్రాన్ని లాక్కునే వ్యక్తి ముస్లిం కానేకాదు. ఇస్లాంను కూడా అర్థం చేసుకోలేడు’ అని వ్యాఖ్యానించారు. ఒక దేశ ప్రధాని ఈ తరహా వ్యాఖలు చేయడం సరికాదని తెలిపారు. మోడీ మాటలపై కాంగ్రెస్ సైతం తీవ్ర స్థాయిలో మండిపడింది. ముస్లింలకు ప్రజల భూములు, బంగారం, ఇతర విలువైన వస్తువులను పంచుతామని కాంగ్రెస్ ఎప్పుడు, ఎక్కడ చెప్పింది? అని ప్రశ్నించారు. కాగా, ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు, మంగళసూత్రంతో సహా విలువైన వస్తువులను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు.



Next Story

Most Viewed