Internship programme: ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ప్రశంసనీయం.. హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
Internship programme: ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ప్రశంసనీయం.. హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: యువతకు శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలను అందిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇది యువతకు గేమ్ చేంజింగ్ మూమెంట్‌ అని అభివర్ణించారు. టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్ ద్వారా 1 కోటి మంది యువతకు ప్రపంచ స్థాయి శిక్షణను అందించనున్నామని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2024-25 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. 4.10 కోట్ల మంది యువతకు విస్తృత నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉపాధి రంగంలో కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రక్రియలో ఈ బడ్జెట్ ముందడుగు కొనియాడారు. ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం వల్ల చిన్న, మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చే మార్గంలో మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed