Lalu Prasad Yadav : మోడీపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-06 09:21:10.0  )
Lalu Prasad Yadav : మోడీపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో భారత ప్రధానిగా ఎవరు వచ్చినా అతడు భార్య లేకుండా ఉండకూడదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన భార్య లేకుండా ప్రధాని నివాసంలో ఉండటం చాలా తప్పు అన్నారు. ఈ సంస్కృతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల పాట్నాలో విపక్షాల కూటమి మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని లాలూ సూచించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారాయి. నిజానికి ప్రధాని మోడీ తన సతీమణికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం లేని వ్యక్తికి దేశంలోని ప్రజల సాధక బాధకాలు ఏం తెలుస్తాయని మోడీ టార్గెట్‌గా కొన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానిగా ఎవరు ఉన్నా అతడు భార్య లేకుండా ఉండకూడదని చెప్పడం ఆసక్తిగా మారుతున్నది. వచ్చే ఎన్నికల్లో విపక్షాల కూటమికి 300 సీట్లు వస్తాయని ఈ సందర్భంగా లాలు ధీమా వ్యక్తం చేశారు.

MP urination case : ‘మూత్ర విసర్జన’ బాధితుడి పాదాలను కడిగిన సీఎం

Advertisement

Next Story