- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిసారిగా రూ. 21,000 కోట్ల మార్కు దాటిన భారత రక్షణ ఎగుమతులు
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రక్షణ ఎగుమతులు సరికొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయని, స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా రూ. 21,000 కోట్ల మార్కును అధిగమించాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సోమవారం దీని గురించి ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన, భారత రక్షణ ఎగుమతులు కొత్త రికార్డు స్థాయిలకు పెరగడం సంతోషంగా ఉందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశ రక్షణ ఎగుమతులు రూ. 21,083 కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన ఎగుమతుల కంటే 32.5 శాతంతో అత్యధిక వృద్ధిని సాధించినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ డిఫెన్స్ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ రెండింటిలోనూ దేశీయంగా తయారీ పెరిగిందని, భారత రక్షణ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి వివరించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, ప్రపంచ గుర్తింపు దిశగా ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించేందుకు స్టార్టప్‌ల నుంచి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, దేశ రక్షణ తయారీ నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను కలిగి ఉందని మంత్రి వెల్లడించారు.