- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Indian Railways Super App: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అన్ని సేవలను ఒకేచోట పొందేలా కొత్త యాప్..!
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే భారతీయ రైల్వే(Indian Railway) వ్యవస్థ నాలుగో అతిపెద్దది. మన దేశంలో రోజుకి కొన్ని కోట్ల మంది ప్రజలు రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. ట్రైన్ టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో మిడిల్ క్లాస్ వాళ్లు రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే దూరం వెళ్లే ప్రయాణీకులు టికెట్ రిజర్వేషన్(Ticket Reservation) చేసుకొని వెళ్తుంటారు. ప్రస్తుతం రైల్వేకు సంబంధించి టికెట్ల బుకింగ్(Tickets Bookings) కోసం ఒక యాప్, ఫుడ్ ఆర్డర్(Food Order) కోసం మరో యాప్ ఇలా వివిధ రకాల యాప్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిరకాల సర్వీసెస్(All Kinds Of Services)ను ఒకే చోట అందించే ఓ సూపర్ యాప్(Super App)ను డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని భారతీయ రైల్వేకు చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ సూపర్ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(CRIS) డెవలప్ చేస్తోందని, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)తో దీన్ని అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందని రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాతో వెల్లడించారు. కాగా ఈ యాప్ అందుబాటులోకి వస్తే టికెట్ బుకింగ్ తో పాటు ఫ్లాట్ ఫామ్ టికెట్, ఫుడ్ ఆర్డర్ వంటి వాటిని ఒక యాప్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక ఇందులో ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.