- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రేట్ న్యూస్.. భారతీయ రైలుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరు
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. ఈ పేరు వింటే ప్రతి భారతీయుని ఛాతీ గర్వంగా ఉప్పొంగుతుంది. ఉగ్ర మూకలతో తుది శ్వాస వరకు పోరాడిన ఆయనకు భారతీయ రైల్వే ఘనమైన నివాళి అర్పించింది. టీకేడీ డబ్ల్యూడీ 4బీ 40049 రైలుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర అని నామకరణం చేసింది. 26/11 న సముద్ర మార్గం ద్వారా ముంబై లోకి చొరబడ్డ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అందరికీ తెలిసిందే. ముంబై తాజ్ హోటల్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు అందులో ఉన్నవారిని నిర్భంధించి రక్తపాతానికి ఒడిగట్టారు.
ఆ సమయంలో 51 ఎస్ఏజీ, ఎన్ఎస్జీ బీహార్ రెజిమెంట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన బృందంతో కలిసి హోటల్ లోపలికి వెళ్లారు. తనతో పాటు వచ్చిన ఒక్కొక్కరు ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన ఏ మాత్రం వెరవకుండా ఒంటరిగా పోరాటం జరిపారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న పలువురిని విడిపించారు. ఈ క్రమంలో తన ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం అశోక చక్ర బిరుదునిచ్చి సన్మానించింది. తాజాగా భారతీయ రైల్వే ఓ రైలుకు ఆయన పేరు పెట్టి ఘనమైన నివాళి అర్పించింది.