Piyush Goyal: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు

by S Gopi |
Piyush Goyal: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో బదులిచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బలహీన ఐదో స్థానం నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో 'టాప్ ఫైవ్'కి చేరుకుందని పీయూష్ గోయల్ అన్నారు. పేదల అభ్యున్నతి గురించి యూపీఏ ప్రభుత్వం ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరంపై ఆరోపణలు చేశారు. 2004లో మాజీ ఆర్థిక మంత్రిగా చిదంబరం బలమైన ఆర్థికవ్యవస్థ వారసత్వాన్ని పొందినట్టు చెప్పారు. ఆ సమయంలో వృద్ధి రేటు 8 శాతానికి పైగా ఉంది. ద్రవ్యోల్బణం దాదాపు 4 శాతంగా ఉంది. అంతేకాకుండా విదేశీ మారక నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. అలాంటప్పుడు 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందని ? ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం చేసిన 10 ప్రసంగాలను తాను చదివానని, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధమైన హామీని తీసుకురావాలని ఎన్నడూ ప్రస్తావించలేదని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత బలహీన దేశం నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా ఎదుగుతోందని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోందని గోయల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed