- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DRDO: వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణిని పరీక్షించిన భారత్
దిశ, నేషనల్ బ్యూరో: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), ఇండియన్ నేవీ సంయుక్తంగా ఫ్లైట్ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ను విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఇండియన్ నావల్ షిప్(ఐఎన్‌ఎస్) నుంచి వీఎల్-ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎంను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ గురువారం ప్రకటనలో తెలిపింది. తక్కువ ఎత్తులో అధిక వేగంతో ల్యాండ్ బేస్‌డ్ వర్టికల్ లాంచర్ నుంచి ఈ పరీక్షను నిర్వహించామని, ఈ సమయంలో క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ట్రాక్ చేయడమే కాకుండా స్థిరంగా టార్గెట్‌ను గుర్తించిందని డీఆర్‌డీఓ వివరించింది. వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం పరీక్ష విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓ, భారత నౌకాదళాన్ని అభినందించారు. 'చాందీపూర్ తీరంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ విజయవంతమైన మిస్సైల్ విజయం వైమానిక దాడులకు వ్యతిరేకంగా భారత నౌకాదళ షిప్‌ల రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది' అని ట్వీట్ చేశారు.