ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్

by S Gopi |
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వృద్ధి స్టార్టప్ కంపెనీలు అత్యంత కీలకంగా మారుతున్నాయని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 1.25 లక్షల స్టార్టప్‌లు, 110 యునికార్న్‌లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ అవతరించిందని మోడీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రసంగించిన మోడీ, ఈ స్టార్టప్‌లు 12 లక్షల మందికి పైగా ఉపాధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ వృద్ధి మెట్రో నగరాలకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా సామాజిక సంస్కృతిగా విస్తరించిందన్నారు. భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది మెట్రో నగరాలకే పరిమితం కాలేదు, ఒక సామాజిక సంస్కృతిగా మారిందని మోడీ అన్నారు. 'సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు రోడ్‌మ్యాప్ కావాలి. దేశంలోని యువత స్టార్టప్‌ల రూపంలో సరికొత్త ఆవిష్కరణలను తీసుకొచ్చి పెట్టుబడులకు ఆకర్షిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఎంతోమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు. పైగా దేశంలో ఉన్న అన్నిట్లో 45 శాతం స్టార్టప్‌లు మహిళల చేతుల్లో నిర్వహించబడుతుండటం మరింత గర్వంగా ఉంది. ప్రభుత్వం సైతం మధ్యంతర బడ్జెట్‌లో రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించామని, ఇది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని' మోడీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed