- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీప్‌సీక్, చాట్‌జీపీటీకి పోటీగా ఇండియన్ ఏఐ టూల్

- స్వదేశీ భాషా నమూనాతో అతిపెద్ద టూల్
- ఇప్పటికే 10 కంపెనీలతో ఒప్పందం
- వెల్లడించిన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్
దిశ, నేషనల్ బ్యూరో:
చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ డీప్‌సీక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఇండియా కూడా తనదైన సొంత ఏఐ టూల్ రూపకల్పనకు నడుంభిగించింది. దేశీయంగా అతిపెద్ద స్వదేశీ భాషా నమూనాతో ఏఐ టూల్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ఇండియన్ ఏఐ మెషిన్ కోసం కేటాయించిన రూ.10,370 కోట్లలోనే కొత్త ఏఐ టూల్ అభివృద్ధి కూడా చేపట్టనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 10 కంపెనీలను జీపీయూలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్), హైఎండ్ చిప్స్ సరఫరా కోసం ఎంపిక చేసింది. వీటిని ఉపయోగించి మెషీన్ లెర్నింగ్ టూల్స్ ద్వారా ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వాటిలో హీరానందాని గ్రూప్‌కు చెందిన యోట్టా, జియో ప్లాట్‌ఫామ్స్, టాటా కమ్యునికేషన్, ఈ2ఈ నెట్‌వర్క్స్, సీఎంఎస్ కంప్యూటర్స్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్, లోకజ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, నెక్ట్స్ జెన్ డేటా సెంటర్, ఓరియంట్ టెక్నాలజీస్, వెన్‌సిస్కో టెక్నాలజీస్ వంటి సంస్థలు ఉన్నాయి. అయితే వీటిలో సగానికి పైగా జీపీయూలు యోట్టా నుంచే వస్తాయని, 9216 యూనిట్లను సప్లయ్ చేస్తామని మాట ఇచ్చినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
ఏడాదిన్నరగా తమ బృందం స్టార్టప్స్, రీసెర్చర్స్, ప్రొఫెసర్లతో కలిసి పనిచేస్తోంది. ఇవ్వాల మేం ప్రతిపాదించిన ఫౌండేషనల్ మోడల్ పూర్తిగా మన సొంతమే. ఈ ఏఐ మోడల్‌లో భారతీయత, మన భాషలు, సంస్కృతి కలగలిపి పక్షపాతం లేకుండా ఉండే సమాచారం వచ్చేలా రూపొందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఫౌండేషన్ మోడల్ తయారు చేస్తన్న ఆరుగురు డెవలపర్స్‌తో టచ్‌లో ఉంది. రాబోయే నాలుగు నుంచి ఎనిమిది నెలల్లో ఫౌండేషనల్ మోడల్ రూపొందే అవకాశం ఉందన్నారు. ప్రపంచ స్థాయి ఫౌండేషనల్ మోడల్ మనకు అందుబాటులోకి రానుందని చెప్పారు. అయితే ఈ ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో మాత్రం మంత్రి వెల్లడించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం 18,693 జీపీయూలను ఆమోదించగా.. ఇప్పటికిప్పుడు 1వేల జీపీయూలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఒక కామన్ కంప్యూటర్ ఫెసిలిటీని లాంఛ్ చేయనుందని.. అక్కడే స్టార్టర్స్, రీసెర్చర్స్ కంప్యూటర్ పవర్‌ను ఉపయోగించుకోవడానికి వీలుంటుందని మంత్రి చెప్పారు.హైఎండ్ జీపీయూలను ఉపయోగించాలంటే గంటకు రూ.150 ఖర్చు చేయాలని.. ఇవి తక్కువ ఎలక్ట్రిసిటీతో నడిస్తే ధర గంటకు రూ.115కు తగ్గుతుందని చెప్పారు. ఎండ్ యూజర్‌కు 40 శాతం సబ్సిడీతో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.