Prashant Kishor: జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2024-12-30 14:51:55.0  )
Prashant Kishor: జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (BPSC) కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పేపర్ లీక్ పై రచ్చ జరుగుతోంది. అయితే, నిరుద్యోగులపై లాఠీఛార్జ్ ను జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) ఖండించారు. పేపర్‌ లీక్‌పై పోరాడుతున్న యువతపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు. పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని ప్రకటించారు. పేపర్ లీకేజీపై గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. వీరిపై ఆదివారం పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించి.. లాఠీఛార్జి చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పీకేకి వ్యతిరేకంగా నిరసనలు

కాగా, ఆదివారం రాత్రి పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తున్న సమయంలో ప్రశాంత్‌ కిషోర్ అక్కడినుంచి వెళ్లిపోతునన్నట్లుగా వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో విద్యార్థులకు, ఆయనకు మధ్య వాగ్వాదం నెలకొంది. తమపై పోలీసులు లాఠీఛార్జి చేసేటప్పుడు అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని అభ్యర్థులు ఆయన్ని ప్రశ్నించారు. నిరసన ప్రాంతం నుంచి ప్రశాంత్‌ కిషోర్ వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, విద్యార్థులు తనపై చేసిన ఆరోపణలను ప్రశాంత్‌ కిషోర్ ఖండించారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. పోలీసులు లాఠీఛార్జి చేస్తుండడంతో విద్యార్థులను అక్కడినుంచి వెళ్లాలని సూచిస్తూ తాను మరో చోటికి వెళ్లానన్నారు. మరోవైపు, బీపీఎస్సీ అభ్యర్థులు నిర్వహిస్తున్న విద్యార్థులు నిరసన చేపట్టేలా ప్రేరేపించారనే ఆరోపణలపై ప్రశాంత్ కిషోర్ సహా తదితరులపై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, నిరసనకారుల తరపున మెమోరాండం సమర్పించడానికి నలుగురు సభ్యుల ప్రతినిధి బృందం గవర్నర్ నివాసానికి చేరుకుంది.


Read More..

AAP: పూజారులకు రూ.18 వేలు వేతనంగా ఇస్తాం- మరో సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

Advertisement

Next Story

Most Viewed