- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : రాష్ట్రాల మధ్య రాహుల్ చిచ్చుపెడుతున్నారు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi)పై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సారథ్యంలోని బీజేపీ(BJP) బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాని(EC)కి ఫిర్యాదు చేసింది. నవంబరు 6న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను కాషాయ పార్టీ తప్పుపట్టింది. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా.. ఇతర రాష్ట్రాలపై మహారాష్ట్ర యువతకు ద్వేషభావాన్ని సృష్టించేలా రాహుల్ కామెంట్స్ ఉన్నాయని బీజేపీ బృందం ఆరోపించింది. దేశ రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేస్తుందనే తప్పుడు ప్రచారానికి ఆయన పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. ఈమేరకు ఆరోపణలతో కూడిన ఫిర్యాదు లేఖను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు.
రాహుల్‌గాంధీ బీజేపీపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా నిలువరించాలని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. ‘‘చాలా నోటీసులు పంపినా.. హెచ్చరికలు జారీ చేసినా రాహుల్ గాంధీ మాటల తీరు మారడం లేదు. ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 353 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి’’అని ఈసీ అధికారులను ఆయన డిమాండ్ చేశారు.‘‘యాపిల్ ఐఫోన్లు, బోయింగ్ విమానాలను మహారాష్ట్ర నిధులతో ఇతర రాష్ట్రాల్లో తయారు చేయిస్తున్నారు’’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజల సంబంధాలు దెబ్బతినే ముప్పు ఏర్పడుతుందన్నారు.