Kangana Ranaut : 99 శాతం కేసుల్లో తప్పు మగవారిదే.. టెకీ సూసైడ్‌‌పై కంగన కామెంట్స్

by Hajipasha |
Kangana Ranaut : 99 శాతం కేసుల్లో తప్పు మగవారిదే.. టెకీ సూసైడ్‌‌పై కంగన కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : భార్య వేధింపులు తాళలేక బెంగళూరు(Bengaluru)కు చెందిన టెకీ అతుల్‌ సుభాష్‌ సూసైడ్ చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటనపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranaut) స్పందించారు. సూసైడ్ చేసుకునే ముందు అతుల్‌ తీసుకున్న చివరి సెల్ఫీ వీడియోను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. స్త్రీవాదం పేరుతో ఎంతకైనా తెగించడం హీనమైన చర్య అని కంగన కామెంట్ చేశారు. ‘‘ఆర్థిక స్థోమతకు మించి అతుల్‌ సుభాష్‌ దగ్గరి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడికి వల్ల అతడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో యావత్ దేశం షాక్‌కు గురైంది’’ అని ఆమె తెలిపారు.

‘‘అయితే ఈ ఒక్క ఘటన ఆధారంగా మహిళలు అందరినీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవాళ్లదే తప్పు ఉంటోంది. ఈ ఒక్క కేసు ఆధారంగా ఆడవాళ్లు అందరినీ తప్పుపట్టకూడదు’’ అని కంగన వ్యాఖ్యానించారు. బెంగళూరుకు చెందిన అతుల్‌ సుభాష్‌ ఏఐ ఇంజినీర్. అతడి భార్య పేరు నితికా సింఘానియా. ఆమె వేధింపులు తాళలేక అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు, భార్య కుటుంబం బ్లాక్‌ మెయిలింగ్‌, కొడుకును కళ్లారా చూసుకోలేని దుస్థితి, కోర్టులోనూ అనుకున్న తీర్పు రాకపోవడంతో అతుల్‌ సుభాష్‌ నిరాశ నిస్పృహలోకి జారుకున్నాడు. ఈనేపథ్యంలో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు 24 పేజీల సూసైడ్‌ నోట్‌‌‌ను రాశాడు. ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించాడు. ‘‘భార్యలు వేస్తున్న తప్పుడు కేసుల వల్ల ఎంతోమంది భర్తలు చనిపోతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలి’’ అని డెత్‌ నోట్‌లో అతుల్‌ సుభాష్‌ కోరాడు.

Advertisement

Next Story