IMD: పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రలకు రెడ్ అలెర్ట్

by Shamantha N |
IMD: పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రలకు రెడ్ అలెర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్(West Bengal), జార్ఖండ్(Jharkhand), ఒడిశా(Odisha) రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఈనెల 17 వరకు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సోమవారం వరకు ఉత్తర బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. ప్రజలు ప్రయాణించే ముందు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలంది. ట్రాఫిక్ రద్దీని తనిఖీ చేయాలని ప్రజలను కోరింది. వాతావరణ శాఖ ప్రకారం పశ్చిమబెంగాల్ లో గంగానదిపై లోతైన అల్పపీడన ఏర్పడింది. ఇది నిదానంగా కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. క్రమంగా అల్పపీడన తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. ఆ తర్వాత బలహీనపడనున్నట్లు తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాలకు ‘ఎల్లో’ అలర్ట్

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈశాన్య రాష్ట్రాల్లో ఐఎండీ ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది. మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అసోం, మేఘాలయాలకు భారీ వర్ష సూచన ఉందంది. ఈశాన్య రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed